![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ 'శుక్రవారం నాటి ఎపిసోడ్ -160 లో.... మహా బర్త్ డే అని చక్రి ఇంట్లో అందరిని నిద్రలేపుతాడు. రేపు మహా బర్త్ డే అని చెప్పగానే అందరు ఒక్కసారిగా లేచి కేక్ కటింగ్ కి ఏర్పాట్లు చేస్తారు. చక్రి వెళ్లి మహాని నిద్ర లేపుతాడు. మళ్ళీ తాగేసి వచ్చాడా ఏంటి అని తనని కొట్టడానికి ఫ్లవర్ వాజ్ చేతిలో పట్టుకుంటుంది మహా. చక్రి చేతిలో బొకే చూసి అది పక్కన పెడుతుంది మహా. హ్యాపీ బర్త్ డే అని చెప్పగానే మహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు తనకి విషెస్ చెప్తారు. మహా కేక్ కట్ చేస్తుంది. అందరికి తినిపిస్తుంది. అప్పుడే నారాయణ వస్తాడు. చక్రి టేబుల్ కింద ఇంకొక కేక్ సర్ ప్రైజ్ కోసమని పెడతాడు. దాన్ని నారాయణ తొక్కుతాడు. చక్రి డిస్సపాయింట్ అవుతాడు.
పర్లేదు లెండి ఇది కూడా మీరు తీసుకొని వచ్చిందే కదా అని మహా అంటుంది. ఆ తర్వాత మాధవ గుడికి వెళ్లి అర్చన చేసుకొని వచ్చానని తనకి బొట్టు ఇస్తాడు. ముందే తెలిస్తే బట్టలు ఇచ్చేవాడిని అని మాధవ అనగానే ఆల్రెడీ నేను తెచ్చాను కదా అని చక్రి అంటాడు. మరి తీసుకొని రండీ అని మహా అనగానే చక్రి హ్యాపీగా ఫీల్ అయి తన కోసం తీసుకొని వచ్చిన సారీ ఇస్తాడు. అది మహా చూసి నాకు ఇష్టమైన కలర్ అని చెప్తుంది. వెళ్లి కట్టుకొని వస్తుంది. ఏవండీ నాకొక డౌట్ చాలా సినిమాల్లో ఇలా ఇవ్వగానే అలా కట్టుకొని వస్తారు. దానికి సంబంధించిన బ్లౌజ్ ఎలా వస్తుందని చక్రి అనగానే సినిమా లో నాకు తెలియదు కానీ ఈ సారికి నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ ఉందని మహా చెప్తుంది. ఆ తర్వాత చక్రి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటాడు.
మరొకవైపు ఎలాగైనా ఆ కానిస్టేబుల్ ధర్మేంద్రని కలవాలని మహా అనుకుంటుంది. ధర్మేంద్ర భార్య తనపై అనుమానంతో మహాకి కాల్ చేసి ఎవతివే నువ్వు.. నా మొగుడిని కలుస్తానంటున్నావని గొడవ పెడుతుంది. మీరు ఎవరికి చేశారని మహా కట్ చేస్తుంది. ఆ తర్వాత ధర్మేంద్రకి మహా కాల్ చేస్తుంది. ఘట్ కేసర్ దగ్గరికి రా అమ్మ అని చెప్తాడు. ఆ తర్వాత విక్కీ దగ్గరికి పర్మిషన్ అడగాలని మహా వెళ్తుంది. తను కూడా ఘట్ కేసర్ సైడ్ వెళ్తున్నానని నాతో రా అని విక్కీ అనగానే మహా సరే అంటుంది. మరొకవైపు మహా బర్త్ డే అని ఇల్లంతా బెలూన్స్ తో నింపేస్తాడు చక్రి. తరువాయి భాగంలో ధర్మేంద్రని మహా కలుస్తుంది. అన్ని నిజాలు తెలుసుకుంటుంది. చక్రి ఫోన్ చెయ్యమంటేనే నీకు కాల్ చేసానని కానిస్టేబుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |